తృటిలో తప్పిన ప్రమాదం.. స్కూల్ బస్సు బీభత్సం..

తృటిలో తప్పిన ప్రమాదం.. స్కూల్ బస్సు బీభత్సం..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ బస్సులను నడిపాలంటే రోడ్ సేఫ్టీ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలని శరతులు పెట్టింది ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ బస్సులను నడిపాలంటే రోడ్ సేఫ్టీ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలని శరతులు పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే బస్సులను నడిపే డ్రైవర్ లు అనుభవజ్ఞులై ఉండాలని తెలిపారు. అంతే కాకుండా చిన్నారులు వెల్లే బస్సులను మంచి కండిషన్‌లో ఉండాలని తెలిపింది. వాహనాలకు సంబంధించిన అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడ చేయించాలని, బస్సు ఫిట్‌నెస్‌ను నిత్యం పరిశీలిస్తూ ఉండాలని శరతులను పెట్టింది.

ఇందులో ఏ ఒక్క నియమాన్ని పాటించకపోయినా వాటిని సీజ్ చేస్తామని గతంలోనే ప్రభుత్వం తెలిపింది. కానీ ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధనలను ప్రయివేటు పాఠశాలల్లో కొన్ని యాజమాన్యాలు పాటించకుండా తుంగలో తొక్కుతున్నాయి. ఫిట్‌నెస్‌లేని బస్సులను రోడ్లపై తిప్పుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ కారణంగా ఇప్పటి వరకూ ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది పిల్లలు గాయాలపాలు కావడమే కాకుండా కొంత మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. ఫిట్ నెస్ లేని బస్సులను పాఠశాల యాజమాన్యం నడిపించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు పైకి, పాదచారులపైకి దూసుకెళ్లింది. అయినా వాహన డ్రైవర్ ఎంత దాన్ని కంట్రోల్ చేసినా అది ఆగకుండా కొంత దూరం వరకు అదే విధంగా ప్రయాణించి.. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది.

ఈ సంఘటనలో బస్సుతో పాటు యాక్టివా, ఆటో పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతే కాకుండా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాగా ఈ బస్సు ప్రమాదానికి గురైన బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందనే చెప్పుకోవాలి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం బస్సు బీభత్సం గురించి ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యలో నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories