Hyderabad: పారిశుధ్య కార్మికురాలిపై మున్సిపాలిటీ శానిటేషన్‌ ఫీల్డ్ అసిస్టెంట్ అఘాయిత్యం.. వీడియో తీసి..

Sanitation Field Assistant Assaults Municipal Worker
x

Hyderabad: పారిశుధ్య కార్మికురాలిపై మున్సిపాలిటీ శానిటేషన్‌ ఫీల్డ్ అసిస్టెంట్ అఘాయిత్యం.. వీడియో తీసి..

Highlights

Hyderabad: కార్మికులకు అండదండగా ఉండాల్సిన అధికారులు కొందరు... కామంతో కళ్లు మూసుకుపోయి.. తమ కిందిస్థాయి వారి పట్ల విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు.

Hyderabad: కార్మికులకు అండదండగా ఉండాల్సిన అధికారులు కొందరు... కామంతో కళ్లు మూసుకుపోయి.. తమ కిందిస్థాయి వారి పట్ల విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో పనిచేసే కార్మికురాలిపై.. ఓ అధికారి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసి ఆమెను లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తనతో ప్రైవేట్‌గా ఉన్న వీడియోలు తీసి బెదిరింపులకు గురిచేశాడు. తన మాట వినకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు తప్పవని భ‍యపెట్టాడు. దాంతో చేసేదేమీ లేక.. ఎవరికీ చెప్పుకోలేక ఆ కార్మికురాలు తీవ్ర మనోవేదనను అనుభవించింది.

గాజులరామారం సర్కిల్‌లో శానిటేషన్ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కిషన్‌.. కిందిస్థాయి కార్మికురాలిపై కన్నెశాడు. తన కోరిక తీర్చుకోవాలనుకున్న అతను.. తాను పై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు. రోజు పనికి వచ్చిన ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.

అయితే కిషన్‌ ఫోన్‌లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లడంతో వారంతా అతన్ని ప్రశ్నించారు. దీంతో విష‍యం బయటకి పొక్కకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇచ్చి 14 మంది కార్మికుల నోరు మూయించినట్టు తెలుస్తోంది. మహిళా ఐఏఎస్ జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం జరిగినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories