Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత..ఏమన్నారో తెలుసా?

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత..ఏమన్నారో తెలుసా?
x

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత..ఏమన్నారో తెలుసా? 

Highlights

Samantha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటి సమంత మరోసారి స్పందించారు. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు తనకు ధైర్యం ఇచ్చారని వెల్లడించారు. ఆన్ లైన్ లో వచ్చే ట్రోలింగ్స్ పై కూడా సమంత స్పందించారు. ఏమన్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ-నటి సమంతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. దీనిపై సమంతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారం పెను దుమారానికి దారితీస్తుంది. ఆ తర్వాత సమంతకు కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు సమంత. తన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ అంశం గురించి మాట్లాడారు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి సమంత సమాధానం ఇస్తూ...

ఎంతో మంది మద్దుతుతో నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. పరిశ్రమకు చెందిన ప్రముఖులకు నాపై ఎంతో నమ్మకం ఉంది. వారు నాపై చూపిన ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిల్చోబెట్టింది. వారంతా నాలో ధైర్యాన్ని నింపారు. కష్టాలను ఎదుర్కొవడంతో పాటు వారి సపోర్టు నాకు ఎంతో ఉపయోగపడింది. వారంతా నా వెంట నిలబడకపోయినట్లయితే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు నాకు చాలా సమయం పట్టి ఉండేది. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్ల సమస్యలను ఎదుర్కొన్నాను అంటూ సమంత చెప్పుకొచ్చారు.

అటు ఆన్ లైన్లో వచ్చిన ట్రోలింగ్స్ పై కూడా సమంత స్పందించారు. అలాంటి వాటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనన్నారు. ద్వేషపూరిత సందేశాలను స్వీకరించినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. అలాంటి మెసేజ్ లు పంపేవారు కూడా అలాంటి బాధను అనుభవించారేమో అని ఆలోచిస్తాను అని సమంత చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories