Sama Ranga Reddy: బీఆర్‌ఎస్‌ పాలనలోనే మహిళలకు అవమానం

Sama Ranga Reddy Comments On Telangana Govt
x

Sama Ranga Reddy: బీఆర్‌ఎస్‌ పాలనలోనే మహిళలకు అవమానం

Highlights

Sama Ranga Reddy: ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి గవర్నర్‌ను ఎలా అవమానపరిచారో తెలుసు

Sama Ranga Reddy: మహిళలకు నిజమైన అవమానం బీఆర్‌ఎస్‌ పాలన.. బీఆర్‌ఎస్‌ పార్టీలోనే జరుగుతుందన్నారు బీజేపీ రంగారెడ్డి అర్భన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి. బీఆర్‌ఎస్‌ నేతలు వాళ్ల పాలకవర్గం మహిళను ఎంత కించపరుస్తుందో ప్రజానికానికి తెలుసన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి గవర్నర్‌ను అసభ్య పదజాలంతో ఎలా అవమానపరిచారో ప్రజలు గమనించారని తెలిపారు. వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ సర్పంచ్‌ బయటకు వచ్చి ఎలా కన్నీటి పర్యంతం అయిందో తెలుసన్న ఆయన ఇక్కడ కనిపిస్త లేదా అవమానం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ప్రీతి లాంటి ఘటనలు చూస్తుంటే స్పష్టం అవుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories