MLC Kavitha: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.. ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు రెండు నెలల ముందే చెప్పిన ఎమ్మెల్సీ కవిత

RTC Workers Thanks to MLC Kavitha
x

MLC Kavitha: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.. ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు రెండు నెలల ముందే చెప్పిన ఎమ్మెల్సీ కవిత

Highlights

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ కార్మికులు

MLC Kavitha: ఆర్టీసీ కార్మికుల దశాబ్ధాల నాటి కల నెరవేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఈ సందర్భంలో ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ డ్రైవర్ ఎమ్మెల్సీ కవితను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరాడు. దీంతో త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆ డ్రైవర్‌కు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories