తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు వెంటనే ప్రారంభించాలి.. యూనియన్ నాయకుల డిమాండ్

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు వెంటనే ప్రారంభించాలి.. యూనియన్ నాయకుల డిమాండ్
x
Highlights

లాక్‌డౌన్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో సాధారణ జీవనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో ఆంక్షలను దాదాపుగా తొలగించారు. అంతర్ రాష్ట్ర...

లాక్‌డౌన్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో సాధారణ జీవనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో ఆంక్షలను దాదాపుగా తొలగించారు. అంతర్ రాష్ట్ర రవాణా విషయంలోనూ అడ్డంకులు తొలగిపోయాయి. సరిహద్దుల చెక్‌పోస్టులను ఇప్పటికే ఎత్తేశారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మాత్రం ఆర్టీసీ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం కనిపించడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

కరోనాతో ఆరు నెలలుగా ఆగిపోయిన అంతరాష్ట్ర సర్వీసులు పున:ప్రారంభం ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఒకవైపు ప్రయివేటు సర్వీసులకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఆర్టీసీ విషయం లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 1000 బస్సులతో సుమారు 2లక్షల 63వేల కిలోమీటర్లు తిప్పుతుంది. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం 750 బస్సులతో లక్షా 53 వేల కిలోమీటర్లు మాత్రమే తిప్పుతుంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోవడంతో టీఎస్ ఆర్టీసీ తీవ్ర నష్టపోతోంది. దీంతో అంతరాష్ట్ర ఒప్పందం పూర్తి చేసి ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపించాలని యూనియన్ నాయకులు ఆర్టీసీని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే అంతరాష్ట్ర సర్వీసులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు రెండు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. అయితే సమస్య పరిష్కారం ఇంకా కొలిక్కిరాలేదు. ప్రధానంగా ఏపీఎస్ లక్ష కిలోమీటర్ల మేర తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాధిస్తే తెలంగాణ ఆర్టీసీనే లక్ష కిలోమీటర్లు పెంచుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదించింది. మొత్తంగా బస్సులు అందుబాటులో లేక రైళ్లు కూడా తక్కువగా నడుస్తుండటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories