రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం- సీఎం రేవంత్ రెడ్డి

Rs.We have kept our promise by waiving loans up to 2 lakh Says CM Revanth Reddy
x

రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం- సీఎం రేవంత్ రెడ్డి

Highlights

CM Revanth Reddy: 31వేల కోట్లతో లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను చేశాం

CM Revanth Reddy: రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8నెలల్లోనే 2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 31వేల కోట్లతో.. లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రుణమాఫీ అమలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులతో కలిసి పాల్గొన్నారు సీఎం రేవంత్. ఎంత మంది అడ్డం పడ్డా రైతులకు రుణమాఫీ చేసి తీరామన్నారు. ఆగస్టు 15లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్‌రావు.. ఇచ్చి మాట మీద నిలబడాలని రేవంత్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories