శ్రీశైలం ఆలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు చుక్కెదురు

శ్రీశైలం ఆలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు చుక్కెదురు
x
Highlights

కర్నూలు జిల్లాలోని ఎంతో ప్రసిద్ది గాంచిన శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అక్కడ విధులు నిర్వహిస్తున్న...

కర్నూలు జిల్లాలోని ఎంతో ప్రసిద్ది గాంచిన శ్రీశైలం భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. శ్రీశైలం దేవస్దానంలో దర్శనం విషయమై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ బీజెపీ కార్యకర్తలకు అక్కడి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దర్శనం టైం అయిపోయిందని చెప్పటంతోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దేవాలయ సిబ్బంధి దాడి చేశారని హైకండ్ కు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు తెలిపారు. దీంతో బిజెపి కేంద్రసహాయక హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.

దీంతో శ్రీశైలం ఆలయ అధికారులు రాత్రికి రాత్రే చిప్ సెక్యూరిటీ ఆఫీసర్, మరో ఇద్దరు కానిష్టేబుల్లపై బదిలీ వేటు వేసి అర్ధరాత్రి బదిలీ చేసారు. ఇక ఈ గొడవకు కారణాలు తెలుసుకునేందుకు విచారణ నిమిత్తం డిఎస్పి వెంకట్రావు శ్రీశైలం వస్తున్నారు. దేవస్దానం అధికారులు శ్రీశైలం దేవస్దానం చిప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సూపండెంట్ శ్రీహరికి భాద్యతలు అప్పజెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories