తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ.. మరి టీఆర్ఎస్‌ ఖాతాలో పడే ఆ నేతలెవరు?

తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ.. మరి టీఆర్ఎస్‌ ఖాతాలో పడే ఆ నేతలెవరు?
x
తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ.. మరి టీఆర్ఎస్‌ ఖాతాలో పడే ఆ నేతలెవరు?
Highlights

తెలంగాణ. ఇక్కడ ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. మార్చి 26న జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరికి పట్టం...

తెలంగాణ. ఇక్కడ ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. మార్చి 26న జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరికి పట్టం కడుతారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ స్థానాల్లో పోటీ చేసే అంత బలం లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీకే ఈ రెండు స్థానాలు దక్కనున్నాయి. త్వరలోనే పదవీ కాలం పూర్తి చేసుకోనున్న ఓ సీనియర్ నేతకు, లెక్కలు పక్కా అని చెబుతున్నా మిగిలిన ఒక స్థానం ఎవరిదన్న దానిపై మాత్రం తీవ్రమైన కసరత్తే జరుగుతోంది.

తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ - కేసీఆర్‌ ఎవరికి పట్టం కడతారన్న చర్చ - ప్రతిపక్షాలకు పోటీ చేసే బలం లేదు!! - మరి టీఆర్ఎస్‌ ఖాతాలో పడే ఆ నేతలెవరు?

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ నలుగురు ఒక చోట చేరినా ఒక్కటే చర్చ. ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేయబోతున్నారని! ప్రస్తుతం ఎంపీగా ఉన్నా కేకేకు మరోసారి అవకాశం ఇస్తారా లేక కొత్త వాళ్లను ఎంపిక చేస్తారా అనేది సందిగ్ధం కొనసాగుతున్నా లెక్కలు పక్కా అని ఆఫ్‌ ద రికార్డుగా వినిపిస్తున్న మాట. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలన్న కేకే అభ్యర్థనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకుంటారా? లేదా కొత్త ముఖాన్ని తెరపైకి తెస్తారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయ్‌.

అయితే ఈసారి రెండు రాజ్యసభ సీట్లకు అశావాహులు మాత్రం బాగానే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాజ్యసభకు పంపుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ వీడలేదు. దానికి తోడు పొంగులేటికి కేటీఆర్ కూడా హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా పొంగులేటికి కలిసిరావచ్చన్న చర్చ నడుస్తోంది.

ఇక- రాజ్యసభ రేసులో పొంగులేటితో పాటు హోంశాఖ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి కూడా ఉన్నారు. తనను రాజ్యసభకు పంపించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు వినికిడి. ఆయనతో పాటు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మండవ వేంకటేశ్వరరావు కూడా రేసులో ఉన్నారని చెప్పుకుంటున్నారు.

మరోవైపు ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. నిజమాబాద్ మాజీ ఎంపీ కవితకు, ఈదఫా రాజ్యసభ సీటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కవిత నిజమాబాద్‌తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్‌ఎన్నికల ప్రచారానికి కూడా దూరం దూరంగానే ఉన్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల పట్ల కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న టాక్‌ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను రాజ్యసభకు పంపడం ద్వారా ఆమెను మళ్లీ యాక్టివేట్‌ చేయవచ్చని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయవర్గాలతో సత్సబంధాలు, వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ భాషల మీద మంచి పట్టు, సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన ఉన్న కవితను రాజ్యసభకు పంపితే హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందంటున్నారు పార్టీ నేతలు.

ఇవన్నీ ఆఫ్‌ ది రికార్డుగా పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తున్న మాటలు. కానీ, ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఎవరూ అందుకోలేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్న పేర్లనే బయటపెడతారా ఊహించని విధంగా కొత్త వాళ్లను తెరపైకి తెస్తారా అన్నది వేచి చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories