రామ రామ ఇదేమి గోల.. మందిర నిర్మాణం విరాళాలపై టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య సవాళ్లు

రామ రామ ఇదేమి గోల.. మందిర నిర్మాణం విరాళాలపై టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య సవాళ్లు
x

రామ రామ ఇదేమి గోల.. మందిర నిర్మాణం విరాళాలపై టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య సవాళ్లు

Highlights

తెలంగాణలో టీఆర్ఎస్‌ వర్సెస్ బీజేపీలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్‌...

తెలంగాణలో టీఆర్ఎస్‌ వర్సెస్ బీజేపీలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్‌ వారు నడుస్తోంది. బల్దియా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో భాగ్యనగరంలో ప్రచారాన్ని హోరెత్తించారు.

ఇక ఇప్పుడు అయోధ్య రామయ్య గుడికి విరాళాల సేకరణకు హెచ్‌పీ, బీజేపీ, సంఘ్‌ పరివార్‌ నేతలు ఇంటింటికి తిరుగుతుండటంతో ఈ రెండు పార్టీల మధ్య వైరం మరింత ముదురుతోంది. తమకు భద్రాద్రి రాముడు లేడా... అయోధ్య రాముడు తమకెందుకని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో ప్రతిఘటన మొదలయ్యింది. తర్వాత పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విరాళాల లెక్కలు అడగడం వరకు చేసిన వ్యాఖ్యలు బీజేపీని రెచ్చగొట్టినట్లయ్యింది. ఇరుపార్టీల నేతలు వరంగల్‌లో పరస్పరం దాడులు చేసుకునే వరకు దారి తీసింది. ఏకంగా పరకాల ఎమ్మెల్యే నివాసంపై బీజేపీ నేతలు దాడికి దిగారు. దీనికి ప్రతీగా టీఆర్ఎస్‌ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడులు చేశారు. చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బీజేపీ తీరుపై మండిపడ్డారు.

రామయ్య గుడి నిర్మాణం కోసం అయోధ్య రామతీర్థ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బీజేపీ మరియు సంఘ్‌ నేతలు విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాల సేకరణ కోసం గల్లి గల్లి ఇల్లిళ్లు తిరుగుతుండటం.. ప్రతి ఇంటిని టచ్‌ చేస్తుండటం టీఆర్ఎస్‌ నేతలను ఆందోళనకు గురి చేస్తోందన్న చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు జనాల్లోకి వెళ్లేందుకు.. గుడికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా విరాళాల వ్యవహారాన్ని తప్పుపడుతుంటే మరికొంత మంది ఎమ్మెల్యేలు బయటికి మాట్లాడలేక లోలోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కొందరైతే వెనకబడి పోకుండా తామే చొరవతీసుకొని వారు కూడా గుడి కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఏకంగా బైక్ ర్యాలీ తీసి అందరూ విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు తలో మాట మాట్లాడుతున్నా పార్టీ ముఖ్యనేతలు కూడా సైలెంట్‌గా ఉంటున్నారు.

అయోధ్య రాముని గుడి విరాళాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే హిందుత్వ వ్యతిరేక ముద్ర పడుతుందని కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. రాముని గుడి నిర్మాణాన్ని బీజేపీ ఓన్ చేసుకోవటం తాము వ్యతిరేకించే టీం గా ముద్రపడుతుండటం టీఆర్ఎస్‌లో ఆందోళనను రేకెత్తిస్తోంది. స్పందిస్తే ఒక సమస్య స్పందిచకపోతే మరో సమస్య వస్తుండటం టీఆర్ఎస్ నేతల్ని ఆందోళనకు గురిచేస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories