తెలంగాణా ముఖ్యమంత్రిగా కేటీఅర్..?

Is KTR became chief minister of telangana
x
తెలంగాణా రాష్ట్ర ముఖమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ (పాత చిత్రం)
Highlights

తెలంగాణ రాజకీయాల్లో కీలక వార్త చక్కర్లు కొడుతుంది. టీఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న స‌మ‌యం రాబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో కీలక వార్త చక్కర్లు కొడుతుంది. టీఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న స‌మ‌యం రాబోతున్నట్లు తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను త్వర‌లో సీఎంను చేయ‌బోతున్నార‌ని ప్రచారం సాగుతుంది. అయితే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఈ వార్త చక్కర్లు కొట్టింది. సీఎం కేసీఆర్ ప‌దేప‌దే జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తారని టీఆర్ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రులు, ఈటల, తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయంటూ కామెంట్‌ చేస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు త‌ర్వాత సీఎంగా కేటీఆర్ బాధ్యత‌లు స్వీక‌రిస్తార‌ని అంద‌రూ భావించిన‌ప్పటికీ అది ఆల‌స్యమ‌వుతూ వ‌స్తుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ ప‌లుసార్లు ముహూర్తం సైతం ఫిక్స్ చేసిన‌ట్లు ప్రచారం జ‌రిగింది. కానీ చివ‌రి నిమిషంలో కేసీఆర్ వెన‌క్కు త‌గ్గిన‌ట్లు వార్తలు చ‌క్కర్లు కొట్టాయి. గ‌త ఏడాది కాలంగా కేటీఆర్ సీఎం కాబోతున్నార‌న్న వార్తలు వ‌స్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ ద‌ఫా కచ్చితంగా సీఎంగా కేటీఆర్ బాధ్యత‌లు స్వీక‌రించ‌బోతున్నారంటూ తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చసాగుతుంది.

సీఎం బాధ్యతలు మంత్రి కేటీఆర్‌కు అప్పగించి.. కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిసారించనున్నట్లు టీఆర్ఎస్‌ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కేటీఆర్‌ను సీఎంను చేసి.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కీలక పదవిలో మంత్రి హరీష్‌రావును కూర్చోబెట్టనున్నట్లు సమాచారం. గ‌తంలో ప‌లుమార్లు ఈ వార్తలు అవాస్తవ‌మ‌ని తేలిన‌ప్పటికీ.. ప్రస్తుతం వెలువ‌డుతున్న వార్తలు నిజ‌మ‌వుతాయో లేదో వేచిచూడాలి.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం కుదిరిందా? మంత్రి ఈటల రాజేందర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలతో రాజకీయవర్గాల్లో ఈ ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. 'కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?' అని ఈటల వంటి సీనియర్‌ నేత అనడం.. కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ సీఎం అవుతారనే ప్రచారానికి, వార్తలకు బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి, కేటీఆర్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచే కేసీఆర్‌ తర్వాత ఆయనే సీఎం అవుతారనే ప్రచారం మొదలైంది. అది 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ఊపందుకుంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలోకి కేటీఆర్‌ వస్తారని పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయితే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు మొదలు ఇటీవల హైదరాబాద్‌లో ప్రాంతీయ పార్టీల సదస్సు నిర్వహణ వరకు సీఎం కేసీఆర్‌ ఆలోచనలు కార్యరూపానికి నోచుకోవడంలేదు.

కానీ, కేటీఆర్‌ సీఎం అవుతారనే ప్రచారానికి మాత్రం తెరపడలేదు. పైగా ముఖ్యమంత్రి కావటానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రులు, పార్టీ సీనియర్లు నొక్కి చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ డోర్నకల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ ఇటీవల ఒక అడుగు ముందుకు వేసి మార్చిలో సీఎంగా కేటీఆర్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌ సీఎం అవుతారనే విస్తృతాభిప్రాయం ఇప్పటికే అధికార పార్టీలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

రంగం సిద్ధమవుతోంది..

'కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ సీఎం కావటం ఖాయం. కానీ ఈ మార్పు ఎప్పుడు అన్నది ప్రశ్న' అనే అంశం పార్టీలో ప్రస్తుతం ఏ ఇద్దరు ముఖ్యలు కలుసుకున్నా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి మార్పు ఎప్పుడు ఉంటుందనే సమాచారం మంత్రులు సహా పార్టీ సీనియర్లు ఎవరికీ లేదని తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఒక్కరే స్పష్టత ఇవ్వగలరని అంటున్నారు. అయితే కేటీఆర్‌ సీఎం కావటానికి రంగం సిద్ధమవుతోందని, ముహూర్తం దగ్గర పడినట్లుగానే అనిపిస్తోందని అధికార పార్టీ ముఖ్యులు అంటున్నారు.

కొన్ని రోజులుగా ప్రభుత్వం, పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలను వారు ఇందుకు ఉదహరిస్తున్నారు. ''సీఎం కేసీఆర్‌ గత నెలలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కువగా ఫామ్‌హౌ్‌సలో ఉంటున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనారోగ్యం కారణంగా పాల్గొనలేదు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం కూడా ఫామ్‌హౌస్‌ నుంచే హెలికాప్టర్‌లో కాళేశ్వరం పర్యటనకు వెళ్లి, తిరిగి ఫామ్‌హౌ్‌సకే వెళ్లారు. అదే సమయంలో కరోనా టీకా ప్రారంభోత్సవం సహా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కేటీఆర్‌ చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రగతి భవన్‌లో మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సందర్శకులను కలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధతపై పార్టీ నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories