KCR: పార్లమెంట్‌ ఎన్నికలకు గులాబీ దండు సిద్ధం.. బహిరంగ సభలతో పాటు.. కేసీఆర్‌ రోడ్‌షోలు

Road Map Ready for KCR Campaign
x

KCR: పార్లమెంట్‌ ఎన్నికలకు గులాబీ దండు సిద్ధం..బహిరంగ సభలతో పాటు.. కేసీఆర్‌ రోడ్‌షోలు

Highlights

KCR: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన

KCR: పార్లమెంట్ ఎన్నికలకు గులాబీ దండును సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. కరీంనగర్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు గులాబీ బాస్. కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈనెల 12న కరీంనగర్ బహిరంగ సభతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బహిరంగ సభలతో పాటు... కేసీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణభవన్‌లో గులాబీ అధిపతి అధ్యక్షతన కరీంనగర్ , పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగాయి. కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే.. కరీంనగర్ బహిరంగ సభ వివరాలను కూడా కేటీఆర్ వెల్లడించనున్నారు.

తెలంగాణ భవన్ లో పెద్దపల్లి లోక్‌సభ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి, కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో చాలా చోట్ల వ్యతిరేకత తగ్గలేదన్న కేసీఆర్... అందరూ తమ ఎమ్మెల్యే ఓడిపోవాలి.. కేసీఆర్ గెలవాలని అనుకున్నారన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలు చేపడతామన్న గులాబీ బాస్.. మండల స్థాయిలో సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు.

అంతకుముందు తెలంగాణ భవన్ లో కేసీఆర్ .. కరీంనగర్ లోక్ సభ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, తెలంగాణలో రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి దాపరించిందన్నారు. బీఆర్ఎస్‌తోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో మొదలైందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని నేతలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా నేతలంతా కలిసికట్టుగా కష్టపడాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories