రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy Will Take Oath as CM Tomorrow
x

రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: ఉదయం ఖర్గే, సోనియా, రాహుల్‌తో భేటీ

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిన్న హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం ఖర్గే, సోనియా, రాహుల్‌తో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఏఐసీసీ అగ్రనేతలను కలవనున్నారు. మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలతో రేవంత్ చర్చించనున్నారు. రేవంత్‌కు అధికారులు సీఎం కాన్వాయ్‌ ఏర్పాటు చేశారు. రేవంత్‌ వెంట షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, బలరాం నాయక్‌ ఉన్నారు.

ఇప్పటికే ఢిల్లీలోనే డీకే శివకుమార్‌, థాక్రే, ఉత్తమ్‌, భట్టి ఉన్నారు. దాదాపు గంటన్నరపాటు డీకేతో రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మాణిక్కం ఠాగూర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈరోడు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంకతో పాటు కేసీ వేణుగోపాల్‌ను రేవంత్‌రెడ్డి కలవనున్నారు. సీఎంగా తన ప్రమాణస్వీకారానికి వారిని రేవంత్‌రెడ్డి ఆహ్వానించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories