Rythu Bharosa Scheme: రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన..అప్పుడే ఇస్తామంటున్న మంత్రి తుమ్మల

Rythu Runa Mafi: గురుపౌర్ణమి సందర్భంగా రైతులకు శుభవార్త..రెండో విడత రుణమాఫీపై కీలక అప్‎డేట్
x

Rythu Runa Mafi: గురుపౌర్ణమి సందర్భంగా రైతులకు శుభవార్త..రెండో విడత రుణమాఫీపై కీలక అప్‎డేట్

Highlights

Rythu Bharosa Scheme:తెలంగాణలో రైతులకు ఇచ్చే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా స్కీం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేసిన అనంతరం రైతు భరోసా స్కీం ప్రారంభిస్తామని తెలిపారు. సాగు చేసే రైతులకు మాత్రమే పంట సాయం అందాలన్నది సీఎం రేవంత్ రెడ్డి కోరిక అంటూ మంత్రి తుమ్ముల చెప్పారు. 10 నుంచి 15 రోజుల్లో రైతుల అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదిక అందిస్తామని తుమ్మల తెలిపారు.

Rythu Bharosa Scheme:తెలంగాణ రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా స్కీముపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన చేసింది.ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సాగుచేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలన్నది సీఎం ఉద్దేశ్యమని తెలిపారు. అయితే రైతు భరోసా పథకాన్ని పంట రుణమాఫీ తర్వాతే ప్రారంభిస్తామని మంత్రి స్ఫస్టం చేశారు. ఖమ్మంలోని వేంసూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి తుమ్మల.

రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు ముందే మాట్లాడుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలని తెలిపారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి కోరిక అని మంత్రి తెలిపారు. గత 5ఏండ్ల కాలంలో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చిందన్నారు. దాని వల్ల 25వేల కోట్లు దుర్వినియోగం అయినట్లు మంత్రి తెలిపారు. 10 నుంచి 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ సీఎంకు నివేదిక అందిస్తుందని తుమ్మల తెలిపారు.

రుణమాఫీ పూర్తయిన తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. రైతు బీమా కూడా కొనసాగించాలని చెప్పినట్లు తెలిపారు. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలని మంత్రి సూచించారు. భవిష్యత్తులో పామాయిల్ ను ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. పామాయిల్ కు రూ. 17వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. పామాయిల్ పండించేలా రైతుకు భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు. కాగా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేకపోయినా ఆగస్టు 15వ తేదీ లోపు 30వేల కోట్లు రుణమాఫీ చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories