Rythu Runamafi: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

Revanth Reddy said in a public meeting held in Kalvakurti that farmers will be given a loan waiver of 2 lakhs.
x

Rythu Runamafi: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

Highlights

Rythu Runamafi: సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి వేదికగా రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Rythu Runamafi: సీఎం రేవంత్ రెడ్డి..కల్వకుర్తిలో పర్యటించారు. కాంగ్రెస్ దివంగత నేత జైపాల్ రెడ్డి ఐదో వర్థంతి సందర్భంగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డిని స్మరించుకున్నారు. సిద్ధాంతాలతో జీవించిన గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సందర్భంలో కొన్ని కల్వకుర్తి ప్రజలకు కొన్ని వరాలు ప్రకటించారు. అవేంటో సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే..

-10ఏళ్లలో నన్ను మేడ్చల్‌లో ఇండిపెండెంట్‌గా గెలిపించారు. నేను క్రమంగా ఎదుగుతూ.. ఇప్పుడు మీ ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాను.

-కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మీకు మాట ఇచ్చినట్లుగానే..కల్వకుర్తికి ఇద్దరు ఎమ్మెల్యేలను మీకు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాను.

-ఇప్పుడు కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించి తీరుతాం.అంతేకాదు కల్వకుర్తిలో ఆర్ అండ్ బీ రోడ్లను రూ.180 కోట్లతో నిర్మిస్తము.

- నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. ఆమంగల్‌లో స్కిల్ సెంటర్ ఇచ్చి, రూ.10 కోట్లు కేటాయిస్తాము.

-రూ.15 కోట్లతో కల్వకుర్తిలో 5 హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మిస్తాం. జైపాల్ రెడ్డి సొంత మండలం మాడుగులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తెస్తాము

- రూ.10 కోట్లతో అక్కడి విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేస్తాం. కల్వకుర్తిలో నియోజకవర్గాలుగా మారిన అన్ని తండాలకూ బీసీ రోడ్లు వేస్తాము.

-మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వేస్తాం. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కి 4 లేన్ల రోడ్లు వేస్తాము

-కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకూ.. ప్రమాదాలను ఆపేందుకు.. శ్రీశైలం హైవేను 4 లేన్ల రోడ్డుగా మార్పించేందుకు ప్రయత్నిస్తాము.

-నేను చదువుకున్న తాండ్ర హైస్కూలుకు 5 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధికి మరో రూ.5 కోట్లు ఇస్తాము.

-యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ముచ్చర్ల ప్రాంతంలో, ఆగస్ట్ 1న 100 ఎకరాల్లో ప్రారంభించబోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

కల్వకుర్తిలో సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రైతు రుణమాఫీకి కింద ఇప్పటికే రూ. 6,093 కోట్లు ఇచ్చామని తెలిపారు. జులై 31 కంటే ముందే 1లక్షన్నర వరకు రుణం ఉన్న రైతుల రుణాలకు రుణమాఫీ ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను విదేశాలకు వెళ్తున్నాని విదేశాల నుంచి తిగిరి వచ్చిన వెంటనే ఆగస్టులో రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories