ఈటలకు రేవంత్‌రెడ్డి సవాల్‌.. 24 గంటల సమయం ఇస్తున్నా.. తడి బట్టలతో..

Revanth Reddy Open Challange to Etela Rajender
x

ఈటలకు రేవంత్‌రెడ్డి సవాల్‌.. 24 గంటల సమయం ఇస్తున్నా.. తడి బట్టలతో..

Highlights

Revanth Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Revanth Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వస్తానని, బీఆర్‌ఎస్‌ ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపించాలని రేవంత్‌ ఛాలెంజ్‌ విసిరారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌ కాకపోతే.. ఏ టెంపుల్‌కు రమ్మంటే ఆ టెంపుల్‌కు తడి బట్టలతో వస్తానని అన్నారు రేవంత్. రేపు ఈటల రావాలని.. ప్రమాణానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు. మునుగోడులో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి కాంగ్రెస్‌ పార్టీదేనని, చందాల రూపంలో వచ్చినవేనని స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్‌ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మునుగోడులో ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి..బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సహాయం రూపంలో ఇచ్చినవేనని, సహాయం అడిగిన సమయంలో తనతో పాటు ఉత్తమ్‌, భట్టి ఉన్నారన్నారు. వాళ్ల శ్రమను ఈటల అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికకు ఉన్నత కులస్థులు రూపాయి సహాయం చేయలేదన్న రేవంత్.. చిల్లర మల్లర రాజకీయాలు చేసే నాయకులు చిత్తు కాగితాలతో సమానమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories