పీసీసీ ఫైట్‌లో రేవంత్‌ కొత్త స్ట్రాటజీ సిద్దమైందా?

పీసీసీ ఫైట్‌లో రేవంత్‌ కొత్త స్ట్రాటజీ సిద్దమైందా?
x
Highlights

ఎక్కడ తగ్గాలో తెలిస్తే రాజకీయాల్లో నెగ్గడం ఈజీనే. అయితే ఈ సూత్రం ఓ లీడర్ కు లేటుగా బోధపడినట్టుంది. సరే లేటుగానైనా లేటెస్ట్‌గా, తనదైన శైలిలో పావులు...

ఎక్కడ తగ్గాలో తెలిస్తే రాజకీయాల్లో నెగ్గడం ఈజీనే. అయితే ఈ సూత్రం ఓ లీడర్ కు లేటుగా బోధపడినట్టుంది. సరే లేటుగానైనా లేటెస్ట్‌గా, తనదైన శైలిలో పావులు కదుపుతున్నాడట. పీసీసీ పీఠం కోసం ఎవర్ని ఎక్కడ కలువాలో ఎవరిని ఎక్కడ కట్ చేయాలో హస్తం పార్టీ నుండే నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాడట. పరిస్థితులు ఏవైనా తనకు అనుకూలంగా మార్చుకుంటూ జాగ్రత్త పడుతున్న ఆ లీడర్ కి, ఆ పదవి కొన్నాళ్లుగా ఊరిస్తోంది. చేతికి చిక్కినట్టే చిక్కి కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్లో చేజారిపోతున్న ఆ నాయకుడికి, ఇదంతా పొలిటికల్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అట. ఇంతకీ ఆ పదవి కోసం ఎలా, ఎట్నుంచి నరుక్కొస్తున్వాడట.

అనుముల రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం, ఇంట్రో అక్కర్లేని పేరు. ఏ పార్టీలో ఉన్నా, ఫైర్ బ్రాండ్ నేతగా మంచి ఫాలోయింగ్ ఉన్న రేవంత్, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తూ జడ్పిటిసి గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అనతికాలంలో అనేక డక్కామొక్కీలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి, పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ ఇప్పుడు పిసిసి చీఫ్ రేసులో ఉన్నారు. పిసిసి అధ్యక్ష నియామకం అన్న ప్రతీసారి రేవంత్ కు వద్దని కొందరు, కావాలని ఇంకొందరు ఎవరైనా ఫర్వాలేదని మరికొందరు, కాంగ్రెస్ మార్కు ఓపినియన్, ఓపెన్ గా చెబుతుంటారు. వీరందరి పాలిట్రిక్స్ ను పసిగట్టిన రేవంత్, పార్టీలో తనదైన గ్రూపును బలంగా తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో లాబీయింగ్ ముఖ్యమని, తనను సపోర్ట్ చేసే కీలక నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారట.

జూబ్లీహిల్స్ లో తన నియోజకవర్గ కార్యాలయం ఓపెనింగ్ నాడే, తనకు మద్దతు పలికే నేతలందర్నీ ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాకు రెండు మూడేసి చొప్పున ఎమ్మెల్యే సీట్లు పట్టుబట్టి ఇప్పించుకున్న రేవంత్, జిల్లాల వారిగా తన పట్టు పెంచుకుంటున్నారట. కొత్తగా వచ్చిన నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించొద్దని సీనియర్లు పదేపదే అడ్డుపడుతున్నా, తన పని తాను చేసుకు పోతున్నారట. ఏడాది కిందటే ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్లి, సోనియాను కలిశారు రేవంత్. సోనియాతో దిగిన ఆ ఒక్క ఫోటో వైరల్‌గా మారడంతో, గాంధీభవన్‌లో అగ్గిరాజుకుంది. సీనియర్లు వరుసకట్టి ఢిల్లీకెళ్లి రేవంత్‌కు పీసీసీ రాకుండా అడ్డుకున్నారట. పార్టీ కూడా గ్రీన్ సీగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గింది. అయితే, పార్టీలో డక్కామొక్కీలు తింటే కాంగ్రెస్ పాలిట్రిక్స్‌లో ఎక్స్‌పీరెన్స్ వస్తుందని, రేవంత్‌ కూడా భావిస్తున్నారట. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ కోటరీకి అత్యంత సన్నిహితుడిగా మారారట. పార్టీ పగ్గాలిస్తే వైఎస్ తరహాలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని మాట కూడా ఇచ్చారట. అయితే, తెలంగాణలో తనను వ్యతిరేకిస్తున్న వారిని కూడా కూల్ చేేసేందుకు, ఇటు నుంచి కూడా నరుక్కొస్తున్నారట రేవంత్.

ఈ క్రమంలో తన పదవికి అడ్డు పడుతున్న వారందర్నీ కలిసాడట. ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతలుగా చెప్పుకునే షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సురేష్ షెట్కార్ బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, అనిల్ కుమార్ యాదవ్‌తో సహా అనేకమంది మద్దతు కూడగడుతున్నారట. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు తనవైపు పనిచేసేలా ముందు జాగ్రత్త పడుతున్నారట రేవంత్.

తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ మినహా మరెవ్వరూ పార్టీని గట్టెక్కించే పరిస్థితిలో లేరనే టాక్ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు అధికార టీఆర్ఎస్‌తో అంటకాగుతున్న తీరు, కోవర్టు వ్యవహారాలను కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పి సక్సెస్ అయిన రేవంత్ కు, చేతిలో పదవి వచ్చే వరకు గ్యారంటీ లేదనే టాక్ కూడా ఉంది. ఓవైపు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో, అధిష్టానంకు లాయల్ గా ఉండే పాత నేతలకు పెద్దపీట వేస్తారా లేక రేవంత్ వైపు మొగ్గు చూపుతారా అనేది త్వరలోనే తేలిపోతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories