భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారింది.. ఆర్థికసంఘం సమావేశంలో సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Makes Key Comments on State Debuts at 16th Finance Commission Meeting
x

భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారింది.. ఆర్థికసంఘం సమావేశంలో సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Highlights

16th Finance Commission Meeting: తెలంగాణకు తగినంత సహాయం అందించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

16th Finance Commission Meeting: ప్రజాభవన్‌లో 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. దేశాభివృద్ధి లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణభారం తెలంగాణకు సవాల్‌గా మారిందని.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు.

ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉంటాయన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు, నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలన్నారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41శాతం నుంచి 50 శాతం పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను ముందు ఉంచుతున్నామన్నారు. ఈ డిమాండ్‌ను మీరు నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని మోడీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories