నేడు ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్‌రెడ్డి

Revanth Reddy is Busy in Delhi Today
x

నేడు ఢిల్లీలో బిజీబిజీగా రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలను కలవనున్న రేవంత్

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను రేవంత్ కలవనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని... మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను రేవంత్ ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలతో రేవంత్ చర్చించనున్నారు. రేవంత్ వెంట షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు.

ఇప్పటికే ఢిల్లీలో డీకే శివకుమార్, థాక్రే, ఉత్తమ్, భట్టి ఉన్నారు. దాదాపు గంటన్నరపాటు డీకేతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మాణిక్కం ఠాగూర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కేసీ వేణుగోపాల్‌ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. సీఎంగా తన ప్రమాణస్వీకారానికి వారిని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories