Revanth Reddy: మీరే కోరి మరీ కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నారు.. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి

Revanth Reddy: మీరే కోరి మరీ కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నారు.. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి
x
Highlights

Revanth Reddy Distributes Teachers Appointment Letters: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మీరు రెండుసార్లు కోరిమరీ కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నారు. ఏ...

Revanth Reddy Distributes Teachers Appointment Letters: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు మీరు రెండుసార్లు కోరిమరీ కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నారు. ఏ సమస్యలైతే దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటూ వచ్చాయో.. ఆ సమస్యల సాధన కోసమే ఉద్యమం చేపట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆ కొరివి దయ్యం చేసిందేమీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన నోటిఫికేషన్‌ని మూడేళ్ల తరువాత 2017 లో ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తరువాత.. అంటే 2019 లో టీచర్ల నియామకాలు జరిగాయి అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. కొత్తగా నియమితులైన టీచర్లకు అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ సందర్భంగా ఇవాళ ఎల్బీ స్టేడియంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న క్రమంలో తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరిగే సందర్భంలో మీ అందరికీ ఒక మాటిచ్చాను. తెలంగాణలో మార్పు రావాలి.. ఇందిరమ్మ రాజ్యం కావాలి. మీకు ఉద్యోగం రావాలంటే ముందుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఉద్యోగం ఊడాలి అని పిలుపునిచ్చాను. మీరంతా అలా కదిలొచ్చి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వచ్చాయి. మరి మాకు కొలువులు ఇచ్చిన తరువాత మా బాధ్యత మేం నిర్వర్తించాలి అనే ఉద్దేశంతోనే అధికారం చేపట్టిన తొలి 90 రోజుల్లోనే 30 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చాం అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.

కొత్తగా అపాయింట్ అయిన టీచర్లను ఉద్దేశించి..

తెలంగాణ సమాజంలో పాఠశాలలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్స్‌గా తీర్చిదిద్ది వారికి చక్కటి భవిష్యత్ అందించే గురుతర బాధ్యతమీపై ఉంది. కేవలం విద్యతోనే సమాజంలో రాణించగలం. తెలంగాణ సమాజం పునర్నిర్మాణంలో టీచర్లుగా మీ పాత్ర ఎంతో కీలకం అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

అందుకే విద్యా శాఖ నావద్దే ఉంది

తెలంగాణ విద్యా శాఖలో చాలాకాలంగా టీచర్ల బదిలీ నుండి ప్రమోషన్స్ వరకు పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందుకే విద్యా శాఖను నావద్దే పెట్టుకుని సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. అందులో భాగంగానే ఎక్కడా కూడా చిన్న సమస్యలు కానీ లేదా వివాదాలు కానీ లేకుండా 34 వేల మంది టీచర్లను బదిలీలు చేయడం మాత్రమే కాదు.. మరో 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ కూడా ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories