Revanth Reedy: సీఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదంటే.. కేసీఆర్ ఎవరిని కాపాడతారు

Revanth Reddy Criticized On KCR Government with IAS officer Smita Sabharwal Tweet
x

Revanth Reedy: సీఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదంటే.. కేసీఆర్ ఎవరిని కాపాడతారు 

Highlights

Revanth Reedy: ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయం భయంగా బతకండని.. స్మితాసబర్వాల్ అనడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి నిదర్శనం

Revanth Reedy: జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ తహశీల్దార్‌ హంగామా రాజకీయ రచ్చకు దారి తీసింది. ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ ట్వీట్‌తో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు. సీఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదంటే కేసీఆర్ ఎవరిని కాపాడతారని ప్రశ్నించారు. ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయంగా బతకాలని చెప్పడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి నిదర్శనమన్నారు.

మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్దార్‌ ఆనంద్‌ అర్థరాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో ఆనంద్‌ను అడ్డుకున్న భద్రతా సిబ్బంది జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి ఘటనపై ట్విట్టర్‌లో స్పందించిన స్మితాసబర్వాల్‌ ఓ వ్యక్తి తన ఇంట్లోకి చొరబడ్డాడని అప్రమత్తతతో తన ప్రాణాలను కాపాడుకున్నానని వివరించింది. ఎంత సురక్షితంగా ఉన్నారని భావించినా ఇంటికి తాళాలు వేసుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories