Telangana Budget 2024: నిరుద్యోగులకు తీపికబురు..జాబ్ క్యాలెండర్ పై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

Revant Sarkar Key Announcement on Job Calendar
x

 Telangana Budget 2024: నిరుద్యోగులకు తీపికబురు..జాబ్ క్యాలెండర్ పై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

Highlights

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ 2024-25వ వార్షిక బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టింది. ఈ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన చేసింది.

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2లక్షల 91వేల 159కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని..అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన చేస్తామని వెల్లడించారు.

ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షను బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం తాజాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం 50వేల పోస్టులతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏటా మార్చి 31వ తేదీ లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ముఖ్యఉద్దేశ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

కాగా ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం..మరోసారి జనవరి నెలలో డీఎస్సీ వేసేందుకు రెడీ అవుతోంది. మొత్తం 6వేల పోస్టులతో రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టత కూడా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories