Independence Day 2023: దేశభక్తిని చాటుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్.. మంచంపై నుంచే జెండా వందనం

Retired Head Master Shows his Patriotism Despite Bedridden
x

Independence Day 2023: దేశభక్తిని చాటుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్.. మంచంపై నుంచే జెండా వందనం

Highlights

Independence Day 2023: దేశం మొత్తం 76వ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో..

Independence Day 2023: దేశం మొత్తం 76వ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో.. ఏడు నెలలుగా మంచానికే పరిమితమైన ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్ కూడా మంచం పైనుంచే తన దేశభక్తిని చాటుకుంటున్నాడు. కరీంనగర్ లో గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్‌గా పనిచేసిన గౌరిశెట్టి కుమారస్వామి.. రిటైర్మెంట్ అయిన తర్వాత.. స్వగ్రామమైన వేములవాడలో ఉంటున్నారు. అనారోగ్య కారణాలతో దాదాపు 7 నెలలుగా మంచంపైనే ఉంటున్న ఈ రిటైర్డ్ ఉపాధ్యాయుడు.. ఆరోజుల్లో స్వాతంత్య వేడుకల్లో తాను పనిచేసిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. ఈరోజు బెడ్ పైనే జాతీయ జెండాను పట్టుకుని జనగణమన ఆలపించడం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంది. కుమారస్వామి‌సార్ ను అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories