నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో తేలని ఫలితం

నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో తేలని ఫలితం
x
Highlights

గ్రేటర్‌లో ఇప్పటివరకు 149 డివిజన్ల ఫలితాలు వెలువడగా అందులో 55 స్థానాల్లో గెలుపుతో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించింది. 48 స్థానాల్లో విజయంతో...

గ్రేటర్‌లో ఇప్పటివరకు 149 డివిజన్ల ఫలితాలు వెలువడగా అందులో 55 స్థానాల్లో గెలుపుతో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించింది. 48 స్థానాల్లో విజయంతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక 44 స్థానాల్లో గెలుపుతో మూడో స్థానంలో ఎంఐఎం ఉండగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది కాంగ్రెస్.

మరోవైపు స్వస్తిక్‌ మార్క్‌ పడని ఓట్లు, పెన్నుతో రాసిన ఓట్లు, వేలిముద్రలు వేసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. దీంతో గ్రేటర్‌ ఎన్నికల్లో పోలైన ఓట్లల్లో చెల్లనివే భారీగా నమోదయ్యాయి. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో స్వస్తిక్ ముద్ర ఉన్న స్టాంపు వేయడానికి బదులుగా డివిజన్, పోలింగ్ బూత్‌ నంబరుతో ఉన్న స్టాంపుతో ఓట్లు వేశారు. అలా 544 ఓట్లు పోలయ్యాయి. దీంతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేయాలని ఫలితాన్ని వెల్లడించొద్దని ఎస్‌ఈసీ ప్రకటించింది. దీంతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం బాకీ ఉంది.

అయితే నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని ప్రకటించేందుకు రిటర్నింగ్ అధికారి ప్రయత్నించగా బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు అభ్యంతరం తెలుపుతూ ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ధర్నాకు అనుమతి లేదని ఆర్వోతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో నేరేడ్‌మెట్ డివిజన్‌ ఫలితాన్ని తాత్కాలికంగా ఆపినట్లు ఆర్వో ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories