ప్రాణాలు తీసిన మ్యాన్‌హోల్..రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Rescue Operation Continues From Two Days For Missing Worker
x

రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ (ఫైల్ ఫోటో)

Highlights

* ఇంకా లభించని అంతయ్య మృతదేహం * కాంట్రాక్టర్, జీహెచ్ఎంసీ అధికారులపై మృతుల బంధువుల ఆగ్రహం

Hyderabad: హైదరాబాద్‌లో ఇద్దరు ప్రాణాలు తీసిన మ్యాన్‌హోల్ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి డ్రైనేజీ క్లీనింగ్‌కు వెళ్లిన శివ, అంతయ్య అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రాత్రి పూట డ్రైనేజీ క్లీన్ చేసేందుకు అనుమతి లేకున్నా కాంట్రాక్టర్ బలవంతం చేయడంతో నలుగురు మ్యాన్ హోల్‌లోకి దిగారు. ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కు‌పోవడంతో కాపాడేందుక వెళ్లి అంతయ్య కూడా ఊబిలో చిక్కుకుని ఊపిరి ఆడక చనిపోయాడు.శివ మృతదేహం లభ్యంకాగా అంతయ్య మృతదేహం కోసం రెండు రోజులుగా గాలిస్తున్నారు. మరోవైపు ఘటనపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories