Hyderabad: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం..!

Removal of Tree Near KBR National Park
x

Hyderabad: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం..!

Highlights

Removal of Tree: కేబీఆర్ పార్క్ ఎదురుగా ఫుట్ పాత్ మీదున్న చెట్టును నరికేశారు ఓ షాపు యజమాని.

Removal of Tree: కేబీఆర్ పార్క్ ఎదురుగా ఫుట్ పాత్ మీదున్న చెట్టును నరికేశారు ఓ షాపు యజమాని. తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయని ఏకంగా 50 ఏళ్ల నాటి చెట్లను నరికేశారు. లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు వృక్షాన్ని తొలగించారు. అర్ధరాత్రి సమయంలో సెలూన్, క్లినిక్‌కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి ఇద్దరూ రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు.

అంతకుముందు రోజు కేబిఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భారీ వృక్షాలను తొలగించొద్దని షాపు యజమానులను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ దుర్మార్గానికి ఒడి గట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories