Beer Sales: తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్ల అమ్మకాలు

Record Sales of Beer in Telangana
x

Beer Sales: తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్ల అమ్మకాలు

Highlights

Beer Sales: మే 1 నుంచి 18 వరకు 4.23 కోట్ల బీర్లు సేల్

Beer Sales: ఎండమండుతున్నాయి. దీంతో తెలంగాణలో బీర్ల జోరు కొనసాగుతోంది. గడిచిన నెలరోజుల్లో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. మే 1 నుంచి 18 వరకు రికార్డు స్థాయిలో 4.23 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే 3.36 లక్షల కార్టన్ల బీరు విక్రయాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉంది. కేవలం బీర్లతోనే ప్రభుత్వానికి 583 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. వేసవి తాపం ఇలాగే ఉంటే మే ఆఖరి వారం వరకు బీర్ల అమ్మకాలు రికార్డులు బద్దలు కొడతాయని భావిస్తున్నారు. బీర్లతో వచ్చే ఆదాయం వేయి కోట్ల మార్కు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా ఏప్రిల్, మార్చి నెలల్లో బీర్ల విక్రయాలు తారస్థాయికి చేరుకోవడం కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి మే మొదటి వారం వరకూ పది రోజుల పాటు వర్షాల కారణంగా వాతావరణం చల్లబడటంతో బీర్ల వినియోగం కూడా ఎప్పటికన్నా బాగా తగ్గిపోయింది. దాంతో ఈ సారి బీర్ల అమ్మకాల్లో తరుగుదల నమోదవుతుందని వైనాప్ యజమానులు భావించారు. 10 రోజులుగా ఒక్కసారిగా పెరిగిన ఎండలు మళ్లీ బీరు విక్రయాలు ఎగబాకాయి. కేవలం 2 వారాల విక్రయాలతోనే గత ఏడాది మే నెల రికార్డులను అందుకోవడం తథ్యమని వ్యాపారులు చెబుతున్నారు.

ఆల్కహాల్ శాతం తక్కువ, ఆరోగ్యానికి హాని కరం కాదు వంటి అపోహలతో అడపాదడపా రుచి చూసేవాళ్లు కూడా వేసవిలో బీరు బాబులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా యువత బీర్ల వినియోగాన్ని మంచినీళ్ల ప్రాయంగా భావిస్తుండటం కనిపిస్తోంది. బీరు చల్లదనాన్ని ఇవ్వడమనేది అపోహ మాత్రమేనని, బీరు వ్యసనం ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణంలో మద్యపానం శారీరక విపత్తుగా మారుతుందని వైద్యులు అంటున్నారు. వేడి వాతావరణం నేపథ్యంలో ఆల్కహాల్ను అత్యధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం నివేదిక చెబుతోంది.

చెమట ద్వారా ఒంట్లోని నీటి శాతానికి వేసవి సీజన్‌లో తీవ్ర నష్టం కలుగుతుంది. మరోవైపు ఆల్కహాల్ వినియోగంతో సంభవించే అధిక మూత్ర విసర్జన ఈ నష్టాన్ని అధికం చేస్తుంది. శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ పరిస్థితి ఏర్పడుతుంది. శరీర పనితీరుకు అవసరమైన సాధారణ ద్రవాల కొర తకు దారితీస్తుంది. దీంతో తీవ్రమైన నాలుక పిడచ కట్టుకుపోయేంత దాహం, పొడి నోరు, తలనొప్పి, మైకం, అలసట, గందరగోళానికి గురికావడం వం టివి ఎదురవుతాయి. ఆల్కహాల్ మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాక శరీరానికి ద్రవాలను నిలు పుకోవడం కష్టతరం చేస్తుంది.

5 నుంచి 12 శాతం ఆల్కహాల్తో, ఇతర ఆల్కహాలిక్ పానీయాల కంటే బీరు తక్కువ హానికరం. కొంత మొత్తంలో ఆల్కహాల్ కలిగి ఉందనే నెపంతో అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యం సమస్యలకు దాని తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్లోని కేలరీలు ఆహారాల నుంచి వచ్చే కేలరీల కన్నా భిన్నంగా ఉండి, పొట్ట ఉబ్బడానికి దారితీస్తాయని.. పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోవడం అన్నింటికంటే ప్రమాదకరమంటున్నారు. అధిక మద్యపానం గుండె కండరాలను దెబ్బతీస్తుందని... స్ట్రోక్, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories