తెలంగాణలో కొత్త పుంతలు తొక్కుతున్న రిజిస్ట్రేషన్ల శాఖ

Record of revenue through registrations telangana
x
Highlights

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఊపు మీద కొనసాగుతున్నాయి. గత వారం రోజుల్లో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ...

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఊపు మీద కొనసాగుతున్నాయి. గత వారం రోజుల్లో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ రిజిస్ట్రేషన్లు లేవు అంటున్నారు అదికారులు. హైదరాబాద్‌ పరిసరాలు, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో జోరు మీదున్న రిజిస్ట్రేషన్ల పై ఓ స్టోరి.

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త ఏడాది ఆరంభం నుంచే రిజిస్ట్రేషన్ల రికార్డులు బద్దలవుతున్నాయి. సరికొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. మొన్నటి వరకు 3 నెలలకు పైగా నిలిచిన రిజిస్ట్రేషన్లు తాజాగా మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 7వ తేదీన జరిగిన 14 వేలకు పైగా రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ద్వారా 94 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంత పెద్ద మొత్తంలో ఒక్కరోజు ఆదాయం రావడం తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇదే ప్రథమమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులంటున్నారు.

కొత్త ఏడాది తొలివారం కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ రాబడులు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు రోజుకు సగటున 6,500 వరకు లావాదేవీలు జరిగాయి. ఈ వారంలో మొత్తం 37,178 లావాదేవీల ద్వారా 208.88 కోట్లు వచ్చినట్టు ఆ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే కేవలం డాక్యుమెంట్ల లావా దేవీల వల్లే ఈ నెలలో ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా సమకూరడం ఖాయమని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రెండు వేల వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఉంటే, మిగతావి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లే ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్‌ అయిన ఆస్తులకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు వర్తించబోవంటూ ప్రభుత్వం స్పష్టం చేయడంతో చాలా మంది క్రయవిక్రయదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 21 వరకు 96 రోజులపాటు రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న వాటన్నింటినీ పూర్తి చేసుకునేందుకు మంచి, చెడు రోజులతో నిమిత్తం లేకుండా ప్రజలు పెద్దఎత్తున సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories