Komatireddy: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశగా వేగంగా అడుగులు

Rapid steps are being taken towards the construction of Regional Ring Road Says Komatireddy
x

Komatireddy: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశగా వేగంగా అడుగులు

Highlights

Komatireddy: RRR భూసేకరణ, ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Komatireddy: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. RRR భూసేకరణ, ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదాశివపేట నుంచి చౌటుప్పల్ వరకు.. ఉత్తర భాగంలో దాదాపుగా భూసేకరణ పూర్తి కావడంతో రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

భూసేకరణ పూర్తి అయ్యాక కేంద్ర అనుమతితో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రిజినల్ రింగ్‌ రోడ్డుకు మొత్తం ఒకే నెంబర్ కేటాయించాలని కోరడంతో కేంద్ర మంత్రి గడ్కరీ ఒప్పుకున్నారని, దీంతో దక్షిణ భాగంలో కూడా రేపటి నుంచి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు సీఎం రేవంత్ సుముఖత తెలిపారని మంత్రి తెలియజేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా లేటెస్ట్ టెక్నాలజీతో RRR నిర్మాణానికి కన్‌సల్టెన్సీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories