రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
x

ప్రతీకాత్మక చిత్రం

Highlights

*అయిదేళ్ల పాపపై అత్యాచారం చేసిన నిందితుడు *ఉరిశిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ *2017లో ఘటనపై మీడియాకు సజ్జనార్ వివరణ

రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి మరణ శిక్ష విధించింది. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వివరించారు. నార్సింగిలో 2017లో ఈ ఘటన జరిగింది. దినేష్ అనే వ్యక్తి అయిదేళ్ల పాపకు మాయమాటలు చెప్పి లేబర్ క్యాంప్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసి పరారైయ్యాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ట్రయల్ నిర్వహించారు. కోర్టులో నిందితుడు దినేష్ కేసుకు వ్యతిరేకంగా అన్ని సాక్షాలు ఉండటం.. దినేష్ అత్యాచారం చేసిన హత్య చిసినట్లు రుజువు కావడంతో కోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ళ పాపను అత్యాచారం, అతి కిరాతకంగా హత్య చేసినందుకు దినేష్ ఉరి శిక్ష విధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories