Ramnagar: అఖిల్ పహిల్వాన్ కేసులో విస్తుపోయే నిజాలు.. ఫోన్‌ నిండా అవే..

Ramnagar Akhil Pahilwan Prostitution Case Updates
x

Ramnagar: అఖిల్ పహిల్వాన్ కేసులో విస్తుపోయే నిజాలు.. ఫోన్‌ నిండా అవే..

Highlights

Akhil Pailwan Case: అఖిల్ పహిల్వాన్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Akhil Pailwan Case: అఖిల్ పహిల్వాన్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువతులకు ఉద్యోగాల పేరిట వల వేసినట్లు గుర్తించారు. ఉద్యోగ అవకాశాల పేరిట వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్ధారించారు. అఖిల్ రిమాండ్ డైరీలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

అబిడ్స్ హోటల్ కాకుండా హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో వ్యభిచార దందాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అఖిల్‌ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకుల వివరాలను గుర్తించిన పోలీసులు.. హోటల్ మొత్తం నెలకు లక్ష రూపాయలు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుసుకున్నారు. రాంనగర్ అఖిల్ వాట్సాప్ డేటాను వెలికితీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories