ఇవాళ మూడోరోజు రాహుల్‌ను విచారించనున్న ఈడీ

Rahul will be interrogated for the third day today
x

ఇవాళ మూడోరోజు రాహుల్‌ను విచారించనున్న ఈడీ

Highlights

ED Interrogation: *రెండ్రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ

ED Interrogation: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇవాళ మరోసారి రాహుల్‌ గాంధీని ఈడీ ప్రశ్నించనుంది. విచారణ పూర్తికానందున ఇవాళ మరోసారి విచారణకు రావాలని రాహుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇప్పటివరకు రెండ్రోజుల విచారణ ఎదుర్కొన్నారు రాహుల్‌. మొదటి రోజు 10 గంటల పాటు రాహుల్‌ను ఈడీ విచారించగా.. రెండో రోజు 11 గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటివరకు మొత్తం 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. PMLA సెక్షన్‌ 50 కింద రాహుల్‌ గాంధీని ఈడీ విచారిస్తోంది.

మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌లో మనీ లాండరింగ్‌ జరిగిందంటూ రాహు‌ల్‌ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. తెలంగాణలో టీకాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రెండోరోజు రాహుల్‌ విచారణను నిరసిస్తూ హైదరాబాద్‌ ఈడీ ఆఫీస్‌ ఎదుట టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగారు. ఉదయం నుంచి ఈడీ ఆఫీస్‌ ఎదుట ప్రశాంతంగా సాగిన కాంగ్రెస్‌ నిరసన.. సాయంత్రానికి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో తమ నిరసనను గాంధీభవన్‌కు మార్చారు టీపీసీసీ. రాహుల్‌ విచారణ ముగిసే వరకు నిరసన ఆపేదే లేదని తేల్చి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గాంధీ కుటుంబాన్ని మోడీ, అమిత్‌షా ఇబ్బందులకు గురిచేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఒక ఎంపీ, పార్టీ అగ్రనేతను ఇన్ని గంటలపాటు విచారణ చేపట్టడమేంటని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని, అవసరమైతే వేలాదిగా ఢిల్లీ వెళ్లి ఈడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రేవంత్‌. RSS బ్యాక్ గ్రౌండ్ లో బీజేపీ ప్రభుత్వం.. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర ఉద్యమ కాలంలో ఒక్క బీజేపీ నేతైనా పోరాడారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి బ్యాంకులు లూటీ చేసిన నేతలంతా బీజేపీలోనే ఉన్నారని చురకలు అంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories