రేపు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్న రాహుల్‌ పాదయాత్ర

Rahul Padayatra Will Enter Kurnool District Tomorrow
x

రేపు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్న రాహుల్‌ పాదయాత్ర

Highlights

Bharat Jodo Yatra: ఈ నెల 18 నుంచి 21 వరకు ఏపీలో రాహుల్‌ పాదయాత్ర

Bharat Jodo Yatra: 24 ఏళ్ల తరువాత తొలిసారి జరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు.. ఆ పార్టీ అధిష్ఠానం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో పార్టీకి చెందిన కీలక నేతలంతా.. ఆయా రాష్ట్రాల్లోని పీసీసీల్లో ఓటేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి ఓటేస్తారన్న చర్చ.. అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. కర్ణాటకలో సాగుతున్న భారత్ జోడో యాత్రను ఒక్క రోజు ఆపి.. ఢిల్లీకి వచ్చి.. రాహుల్ ఓటేస్తారా? లేకపోతే ఓటేయరా? అంటూ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర.. బళ్లారి జిల్లాలోని ఏపీ సరిహద్దులో సాగుతోంది. రాహుల్ గాంధీ కోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేసే గ్రామంలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఏపీ సరిహద్దులోని సుగినేకల్ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రాహుల్ తో పాటు జోడో యాత్రలో పాల్గొంటున్న 40 మంది ప్రతినిధులు కూడా సుగినేకల్ లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ జోడో యాత్ర.. నిన్నటితో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బళ్లారిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories