Rahul Gandhi: కేంద్రంలోని మోడీని ఓడించాలంటే.. తెలంగాణలోని కేసీఆర్‌ను ఓడించాలి

Rahul Gandhi Elections Campaign in Nampally
x

Rahul Gandhi: కేంద్రంలోని మోడీని ఓడించాలంటే.. తెలంగాణలోని కేసీఆర్‌ను ఓడించాలి 

Highlights

Rahul Gandhi: తెలంగాణలో దొరల పాలన పోయి.. ప్రజల పాలన వస్తోంది

Rahul Gandhi: కాంగ్రెస్‌ పార్టీని డ్యామేజ్‌ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తనపై దేశవ్యాప్తంగా కేసులు పెట్టారని, లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని గుర్తుచేశారు రాహుల్‌ గాంధీ. నాంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌.. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీ కలిసి పనిచేస్తాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలన్నీ కేంద్రం చెప్పినట్టే పనిచేస్తాయని విమర్శించారు. బీజేపీ చెప్పిన అభ్యర్థులనే ఎంఐఎం పోటీలో దించుతోందని చెప్పారు. కేంద్రంలోని మోడీని ఓడించాలంటే.. తెలంగాణలోని కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో దొరల పాలన పోయి.. ప్రజల పాలన రాబోతోందని చెప్పారు రాహుల్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories