TS Congress: అగ్రనేతల రాకతో కాంగ్రెస్‌లో కొత్త జోష్..!

Rahul And Priyanka To Launch Telangana Bus Yatra On October 18
x

TS Congress: అగ్రనేతల రాకతో కాంగ్రెస్‌లో కొత్త జోష్..!

Highlights

TS Congress: రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ దశ మారుతుందా..?

TS Congress: అగ్రనేతల పర్యటనతో ప్రచారాన్ని మరింత వేడెక్కించబోతోంది టీ-కాంగ్రెస్. సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడ సభ తర్వాత మరోసారి రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక గాంధీలు రాబోతున్నారు. ఈ సారి అలా వచ్చి ఇలా వెళ్లడం కాదు 3 రోజుల పాటు ఇక్కడే మకాం వేయబోతున్నారు. బస్సు యాత్రతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించబోతున్నారు.

రాహుల్, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈనెల 18న ములుగు జిల్లాలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సభలో పాల్గొని మహిళా డిక్లరేషన్​ను ప్రకటిస్తారు. ములుగు, ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాల్లో మూడు రోజుల పాటు రాహుల్, ప్రియాంక పర్యటన కొనసాగనుంది. బస్సు యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో హస్తం నేతలు మమేకం కానున్నారు. నిరుద్యోగ యువత, రైతులు, సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ వర్కర్స్​​, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కాంట్రాక్ట్​ ఉద్యోగులు, రైస్​ మిల్లర్ల అసోసియేషన్ సభ‌్యులతో పాటు..బోధన్​లో బీడీ కార్మికులు, గల్ఫ్​ వలస కార్మికుల కుటుంబాలతోనూ రాహుల్ సమావేశం కానున్నారు. వారి సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనే భరోసా నింపనున్నారు. షుగర్​ ఫ్యాక్టరీని కూడా పరిశీలించనున్నారు రాహుల్.

రాహుల్, ప్రియాంక పర్యటనతో తెలంగాణలో ప్రచార పర్వం కొత్త టర్న్ తీసుకోనుందా..? బీఆర్ఎస్, బీజేపీ పాలనా వైఫల్యాలపై రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో విరుచుకు పడబోతున్నారా..? కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనతో ఇక ప్రత్యర్థులకు ముచ్చెమటలేనా.? రాహుల్ రాకతో హస్తానికి కొత్త జోష్ వస్తుందా అని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రోజుకు రెండు సభలతో.. కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఇక రాహుల్, ప్రియాంక బస్సు యాత్రలతో తెలంగాణ రాజకీయం ఇంకాస్త వేడెక్కుతుందనే చెప్పాలి.

విమర్శలకు ప్రతి విమర్శలు, కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌తో మూడు రోజుల పాటు రాజకీయం రంజుగా మారబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ బస్సు యాత్ర చేయబోతున్న.. ములుగు, ఉమ్మడి కరీంనగర్, నిజామబాద్‌ జిల్లాల్లో హస్తం పార్టీ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఇక్కడ బీఆర్ఎస్ హవా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో రాహుల్, ప్రియాంక పర్యటనతో ఆయా జిల్లాల్లో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఏదేమైనా రాహుల్, ప్రియాంక టూర్లతో తెలంగాణలో సీన్ మారబోతుందా..? కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఇది ఏమాత్రం కలిసి వస్తుంది అనే చర్చ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories