మోహన్ బాబు అరెస్టు ఆలస్యం కాలేదు.. రాచకొండ సీపీ కీలక కామెంట్స్..

మోహన్ బాబు అరెస్టు ఆలస్యం కాలేదు.. రాచకొండ సీపీ కీలక కామెంట్స్..
x

మోహన్ బాబు అరెస్టు ఆలస్యం కాలేదు.. రాచకొండ సీపీ కీలక కామెంట్స్..

Highlights

CP Sudheer Babu: మోహన్ బాబు ఫ్యామిలీపై ఇప్పటికే మూడు FIR లు నమోదు అయ్యాయన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.

CP Sudheer Babu: మోహన్ బాబు ఫ్యామిలీపై ఇప్పటికే మూడు FIR లు నమోదు అయ్యాయన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం చేయడం లేదని ఆయన చెప్పారు. ఆయనకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ నెల 24 వరకు టైం అడిగారని.. కోర్టు టైం ఇచ్చినందున ఆయనను అరెస్ట్ చేయలేదని సీపీ వివరించారు. మోహన్ బాబు తన వద్ద ఉన్న గన్లు చంద్రగిరిలో ఉన్నప్పుడు తీసుకున్నారని సీపీ తెలిపారు. రాచకొండ నుంచి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవన్నారు. మరోసారి నోటీసులు ఇచ్చాక మోహన్ బాబు విచారణకు అటెండ్ కావాలన్నారు. మళ్లీ టైం కావాలంటే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. లేదంటే వారంట్ ఇష్యూ చేస్తామని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు మోహన్ బాబు(Mohan Babu) తన లైసెన్స్‌డ్ గన్‌ను సరెండర్‌ చేశారు. తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్‌ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు ఆదేశించారు.

ఇక జల్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన ఘటనపై తాజాగా మరోసారి స్పందించారు మోహన్ బాబు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories