ప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో

ప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో
x
Highlights

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణానికి స్మార్ట్ కార్డు ద్వారా, టికెటింగ్ ద్వారా వెళ్లే అవకాశం ఉంది....

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణానికి స్మార్ట్ కార్డు ద్వారా, టికెటింగ్ ద్వారా వెళ్లే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో మొబైల్ యాప్ ద్వారా టికెట్ కూడా అందుబాటులోకి రానుంది. అసలు మొబైల్ యాప్ ద్వారా టికెటింగ్ సిస్టిమ్ ఎలా పనిచేస్తుంది..? దీనిపై ప్రయాణికులు ఏమంటున్నారు..? ఓ లుక్కేద్దాం.

హైదరాబాద్ మెట్రో, నగర ప్రజా రవాణాను మరింత సులభతరం చేయనుంది. అందుకోసం త్వరలోనే యాప్-బేస్డ్ క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే మెట్రో ప్రయాణికులు టికెట్ల కోసం లైన్ లో వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పుతాయి.

యాప్‌తో నేరుగా తమ మొబైల్ ద్వారానే టికెట్స్ కొనుగోలు చేసే సౌకర్యం కలుగుతుంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి మెట్రో కార్డుకు అదనపు ప్రయోజనకారిగా ఉండబోతుంది. డిసెంబర్ చివరి నాటికి క్యూఆర్ కోడ్ విధానం ప్రవేశపెడతామని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి చెబుతున్నారు.

ఇలా మెట్రోరైలు ప్రయాణికులకు టికెటింగ్‌ విధానం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న వారిలో 60 శాతం మంది మెట్రో స్మార్ట్‌ కార్డు వినియోగిస్తుంటే.. మిగతావారు బుకింగ్‌ కౌంటర్లలో టోకెన్‌లు కొనుగోలు చేసి ప్రయాణిస్తున్నారు. రద్దీ వేళల్లో కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరుతున్నారు.ఇక స్టేషన్‌కు రాకుండానే టికెట్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం రాబోతుంది. ఎక్కడి నుంచైనా మొబైల్‌లోనే టికెట్‌ తీసుకునేలా కొత్త యాప్‌ను ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు అభివృద్ధి చేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories