PVP case: పీవీపీ పోలీసు విచారణకు గైర్హాజరు.. కదలికలపై నిఘా

PVP case: పీవీపీ పోలీసు విచారణకు గైర్హాజరు.. కదలికలపై నిఘా
x
Highlights

PVP Case: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసు ఇచ్చినా హాజరుకాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసు ఇచ్చినా హాజరుకాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందిని ఫిలింనగర్‌లోని ఆయన ఇంటి వద్ద ఉంచారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో గోడవివాదంలో.. కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. (ప్రముఖ నిర్మాత 'పివిపి' పై కేసు..అరెస్ట్ తప్పదా?)


ఏడాది క్రితం పివిపి విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్. అయితే ఆ సమయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా విక్రయించారు అంటున్నారు ఆయన… కానీ ఇప్పుడు టెర్రస్‌పై గార్డెన్‌ నిర్మిస్తుంటే వద్దని పివిపి బెదిరిస్తున్నారని ఆరోపించారు.. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయగా.. పివిపి తనపై దౌర్జన్యానికి దిగారని కైలాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 మంది వ్యక్తులను తమ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కైలాష్.. దీంతో కైలాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంజారాహిల్స్‌ పీఎస్‌లో పివిపిని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో పీవీపీ పై కేసు బుక్ చేసిన పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని రాత్రి 10.30 గంటల వరకు విచారించారు. మరుసటి రోజు కూడా విచారణకు రావాలని నోటీసు జారీ చేసినా ఆయన వెళ్లలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories