Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాట ఘటనకు సంబంధంచి సంధ్య థియేటర్ యజమానితోపాటు ముగ్గురు అరెస్టు

Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాట ఘటనకు సంబంధంచి సంధ్య థియేటర్ యజమానితోపాటు ముగ్గురు అరెస్టు
x
Highlights

Pushpa 2 : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట రేవతి అనే మహిళ మరణించిన విషయం...

Pushpa 2 : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట రేవతి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో సంధ్య థియేటర్ యజమానితోపాటు, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్సులోని సంధ్య థియేటర్ వద్ద ఈనెల 4వ తేదీన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హీరో అల్లు అర్జున్ తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు.

పుష్ప 2 మూవీ చూసేందుకు తన టీముతో కలిసి సంధ్య థియేర్ కు వచ్చిన హీరో అల్లు అర్జున్ పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించలేదని..సెంట్రల్ జోన్ డీసీపీ అకాన్ష్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని తెలిపారు. హీరో అల్లు అర్జున్ వచ్చారని తెలుసి లోయర్ బాల్కనీలోకి అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగి మహిళ మరణించిందని డీసీపీ తెలిపారు.

తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్, అతని ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవతి అనే మహిళ మరణించడంతోపాటు ఆమె కుమారుడు సాయి తేజ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రేవతి భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలు సాయితేద, సాంగ్వికతో కలిసి సినిమా చూసేందుకు వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories