బాటిల్‌నెక్‌కు శాశ్వత పరిష్కారం : పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం

బాటిల్‌నెక్‌కు శాశ్వత పరిష్కారం : పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభం
x
Highlights

లాక్‌డౌన్‌ తరుణంలో జీహెచ్‌ఎంసీ వేగంగా చేసిన ప్రాజెక్టుల్లో స్టీల్‌ బ్రిడ్జి వర్క్ కూడా ఒకటి. కాగా నగరంలో పూర్తయిన మొట్టమొదటి ఈ స్టీల్‌ బ్రిడ్జి ని శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు.

లాక్‌డౌన్‌ తరుణంలో జీహెచ్‌ఎంసీ వేగంగా చేసిన ప్రాజెక్టుల్లో స్టీల్‌ బ్రిడ్జి వర్క్ కూడా ఒకటి. కాగా నగరంలో పూర్తయిన మొట్టమొదటి ఈ స్టీల్‌ బ్రిడ్జి ని శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ బ్రిడ్జిను ఒక్కడ నిర్మించడానికి గల కారణాలను చూసుకంటే పంజగుట్ట శ్మశానవాటిక (చట్నీస్‌) సమీపం నుంచి రహదారి విస్తరణకు అవకాశం లేదు. కాగా ఈ ప్రాంతమంతా కూడా తీవ్ర బాటిల్‌నెక్‌తో బ్లాక్‌స్పాట్‌గా మారిపోయింది. దీంతో ఇక్కడ వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఆ ప్రమాదాలను పూర్తిగా నర్మూలించేందుకు, ప్రజల సమస్య పరిష్కారం కోసం క్యారేజ్‌వే పెంచేందుకు చిన్న ఫ్లైఓవర్‌ అవసరమని భావించారు. ఈ ప్రాంతంలో ఉండే ట్రాఫిక్‌ రద్దీ, ఇతరత్రా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని స్టీల్‌బ్రిడ్జి నిర్మాణాన్ని తలపెట్టారు.

గత ఫిబ్రవరి నెలాఖరులో ఈ క్యారేజ్‌వే పనులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాక్‌డౌన్‌లో అమలులో ఉండడంతో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఏర్పడలేదు. దీంతో మంత్రి కేటీఆర్, మేయర్‌ రామ్మోహన్‌ ప్రత్యేక శ్రద్ధ వహించిన నేపథ్యంలో అధికారులు వడివడిగా పనులను ఈ నెలలో పూర్తిచేశారు. నిజానికి ఈ నెల మొదట్లోనే దీన్ని ప్రారంభించాల్సి ఉండగా తుది మెరుగుల కోసం ఆగాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని మూడు నెలల్లోనే బ్రిడ్జిని పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. దీని నిర్మాణంలో మెయిన్‌గర్డర్లు, క్రాస్‌గర్డర్లు స్టీల్‌వి వాడినట్లు తెలిపింది. ఈ బ్రిడ్జి వినియోగంతో ముఫకంజా కాలేజ్‌ వైపు నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వైపు వాహనాల రాకపోకలకు ట్రాఫిక్‌ సమస్య తీరడంతోపాటు వాహనదారులకు ప్రయాణ సమయం కలిసివస్తుందని పేర్కొంది. బ్రిడ్జి ఆరు మీటర్లతో పాటు మొత్తం 12 మీటర్ల క్యారేజ్‌వేతో బాటిల్‌నెక్‌ సమస్య తీరుతుందని పేర్కొంది. ఇక ఈ బ్రిడ్జి మొత్తం పొడవు వంద మీటర్లు. స్టీల్‌బ్రిడ్జి స్పాన్‌ 43 మీటర్లు ఉంటుంది.

ఇక ఈ స్టీల్‌ బ్రిడ్జి విశేషాలను తెలుసుకుంటే దీని పొడవు మొత్తం 100 మీటర్లు ఉంటుంది. ఈ స్టీల్‌ బ్రిడ్జి స్పాన్‌ 43 మీటర్లు (సింగిల్‌ స్పాన్‌) ఉంటుంది. దాని పొడవు 57 మీటర్లు, అదే విధంగా ఎన్‌ఎఫ్‌సీఎల్‌ వైపు 35 మీటర్లు, ముఫకంజా కాలేజ్‌ వైపు 22 మీటర్లు ఉంటుంది. ఇక దాని వెడల్పు 9.60 మీటర్లు ఉండగా క్యారేజ్‌ వే 6 మీటర్లు వెడల్పు ఉంటుంది. అంతే కాకుండా దానికి 1 మీటరు ఫుట్‌పాత్‌ కూడా ఉంటుంది. రద్దీ సమయంలో ట్రాఫిక్‌ 11,305 పీసీయూ కాగా 2035– 36 నాటికి ట్రాఫిక్‌ 17,613 ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories