‌తెలంగాణ శాసనసభను సందర్శించిన పంజాబ్ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్

Punjab Speaker Sardar Kultar Singh Sandhwan Visited Telangana Legislative Assembly
x

‌తెలంగాణ శాసనసభను సందర్శించిన పంజాబ్ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్

Highlights

*శాసన సభ నిర్వహణ, పని తీరుపై వివరించిన పోచారం

Sardar Kultar Singh Sandhwan: తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ సందర్శించారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ‍యనకు స్వాగతం పలికారు. ఈసందర్బంగా తెలంగాణ శాసన సభ నిర్వహణ, పని తీరుపై పంజాబ్ స్పీకర్‌కు పోచారం వివరించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వహణ అత్యుత్తమంగా ఉన్నదని ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. శాసనసభ సమావేశాల నిర్వహణ పద్ధతులపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పంజాబ్ బృందానికి వివరించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికి అద్భుతాలు చేస్తున్నదని దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుపున పంజాబ్ స్పీకర్‌కు శాలువాతో సత్కరించి మెమొంటో ను బహూకరించారు. పంజాబ్ రాష్ట్ర స్పీకర్ తో పాటు ఆ రాష్ట్ర శాసనసభ్యుడు కల్వంత్ సింగ్ పండోరి, మాజీ శాసనసభ్యుడు అమర్ జీత్ సింగ్ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories