Harish Rao: ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది

Public health care has been abandoned by the government Says Harish Rao
x

Harish Rao: ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది

Highlights

Harish Rao: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శం

Harish Rao: విషజ్వరాలు విజ్రుంభిస్తోన్న సమయంలో ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అనేక విప్లవాత్మక పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందన్నారు హరీష్‌రావు. కానీ ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో వైద్యారోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.

కాంగ్రెస్ పాలన పుణ్యమా అని మళ్లీ.. "నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు" అనే రోజులు పునరావృతం అయ్యాయని ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. "పడకేసిన ప్రజారోగ్యం, రోగుల మందులు ఎలుకల పాలు, కుర్చీలోనే గర్భిణీ డెలివరీ, ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్మెంట్" ... ఇవన్నీ ప్రజారోగ్య సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు.? అని ప్రశ్నించారు. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.


Show Full Article
Print Article
Next Story
More Stories