GHMC: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను అసెస్‌మెంట్ వేగవంతం...

Property Tax Assessment Speed Up in Greater Hyderabad Municipal Corporation | Live News
x

GHMC: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆస్తిపన్ను అసెస్‌మెంట్ వేగవంతం...

Highlights

GHMC: *నూతన ఆస్తి అసెస్‌మెంట్, మ్యుటెషన్ ప్రక్రియ సులభతరం *ప్రాపర్టీ ట్యాక్, వేకెంట్‌ల్యాండ్ నెంబర్ ఆటోమెటిక్‌గా మార్పు

GHMC: ఆస్తిపన్ను అసెస్ మెంట్ ప్రక్రియ వేగవంతానికి జీహెచ్ఎంసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారదర్శకంగా ఆస్తులను ట్యాక్స్ నెట్ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈపద్దతి ద్వారా కొనుగోలు చేసిన నూతన ఆస్తి అసెస్‌మెంట్, మ్యుటెషన్ ప్రక్రియ సులభతరం కానున్నది. రిజిస్ట్రేషన్ అయిన పాత ఆస్తికి ఇంతకు ముందు జారీ చేసిన ప్రాపర్టీ ట్యాక్, వేకెంట్ ల్యాండ్ నెంబర్ ఆటోమెటిక్ గా ఎలాంటి మార్పు లేకుండా అదే నెంబర్ తో నూతన యజమాని పేరున నమోదు కానున్నది.

తరచు జీహెచ్ఎంసీ చుట్టూ తిరగాల్సిన ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. అంతే కాదు సిబ్బంది కొరతతో అసెస్ మెంట్ ప్రక్రియ సకాలాలంలో పూర్తి కాలేదన్న అభిప్రాయం తొలగిపోనున్నది. ఆస్తిపన్ను అసెస్‌మెంట్ ఆన్‌లైన్ ప్రక్రియతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నివాస గృహాలకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు ఒక రూపాయి 25 పైసల చొప్పున.. మిగతా ప్రాంతాలకు ఒక రూపాయి చొప్పున ఆస్తి పన్ను వేయనున్నారు.

వేకెంట్ ల్యాండ్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ విలువలో 0.50 శాతం పన్ను వేయనున్నారు. ఆస్తిపన్ను అసెస్ట్ మెంట్ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్ కు రెండు లింకులతో కూడిన మెసేజ్ పంపించనున్నారు. మొదటి లింక్ ద్వారా అసెస్మెంట్ వివరాల కాపీ, రెండో లింక్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు ఉత్తర్వు ప్రకారం నిర్దారించిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories