సీఎం కేసీఆర్‌కు నిర్మాత నట్టి కుమార్ లేఖ

సీఎం కేసీఆర్‌కు నిర్మాత నట్టి కుమార్ లేఖ
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సినీ నిర్మాత నట్టి కుమార్ లేఖ రాశారు. అటు కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో ధియెటర్లు మూతపడిన సంగతి తెలిసింది. ఈ...

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సినీ నిర్మాత నట్టి కుమార్ లేఖ రాశారు. అటు కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడంతో ధియెటర్లు మూతపడిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో థియేటర్లను తెరవకపోవడం వల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని లేఖలో ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న థియేటర్ లీజు ఓనర్లు కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో థియేటర్లను తెరచి కార్మికులను ఆదుకోవాలని ఆయన సీఎం కేసీఆర్ ని కోరారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కార్మికులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్రం లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చినా.. సినిమా హాళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా కోవిడ్‌ లాక్‌డౌన్‌తో మూతపడ్డ సినిమా థియేటర్లను ఈనెల 15 నుంచి పలు నిబంధనలతో తెరుచుకోవచ్చని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది అయితే రాష్ట్రంలో మాత్రం తెరుచుకోలేదు. ఐదు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాల షూటింగ్స్ చేసుకోవ‌డానికి కొన్ని విధివిధానాల‌ను రూపొందించి ఓకే చెప్పాయి. ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వం థియేటర్లను తెరిచేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చిందన్నారు నట్టి కుమార్ తెలిపారు. తెలంగాణలో రాష్ట్రంలో కూడా ధియేటర్లు తెరిచేందుకు పర్మిషన్ ఇస్తే రెండు రాష్ట్రాల్లో ఒకే సారి విడుదల చేయడానికి వీలవుతుందని సీఎం కేసీఆర్ కు నట్టి కుమార్ ఓ ప్రకటన ద్వారా వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories