ప్రైవేట్ ఆసుపత్రుల కొత్త దందా.. అంతకు మించి అంటూ ఆఫర్లు

ప్రైవేట్ ఆసుపత్రుల కొత్త దందా.. అంతకు మించి అంటూ ఆఫర్లు
x
Representational Image
Highlights

కరోనా భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు వైద్యులు కొత్త రకం వైద్యానికి తెరలేపారు. అనుమతి లేకున్నా హోం ఐసోలేషన్ పేషెంట్లకు ప్యాకేజీ వైద్యం...

కరోనా భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు వైద్యులు కొత్త రకం వైద్యానికి తెరలేపారు. అనుమతి లేకున్నా హోం ఐసోలేషన్ పేషెంట్లకు ప్యాకేజీ వైద్యం అందిస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్యాకేజీ వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఒకరికి మించి మరొకరు పోటీ పడుతున్నారు. అంతకు మించి ఆఫర్లు అంటూ గాళం వేస్తున్నారు. కరోనాను క్యాష్ చేసుకునేందుకు ఇందూరు వైద్యుల కోవిడ్ వైద్య సేవల దందాపై స్పెషల్ రిపోర్ట్.

నిజామాబాద్ జిల్లాలోని కొందరు ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వ అనుమతి లేకున్నా కరోనా వైద్యానికి తెరలేపారు. కొందరు తమ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తామంటూ క్యాష్ చేసుకుంటుంటే మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నా.. ప్యాకేజీ వైద్యం ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కరోనా బూచి చూపి.. రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఒక్కో ఆసుపత్రి వైద్యుడు ఒక్కొ తరహా ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. 14 రోజుల హోం క్వారంటైన్ ప్యాకేజీ 10 వేల నుంచి 15 వరకు వసూలు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో ఫోన్లో కోవిడ్ పేషెంట్లతో మాట్లాడటం, ఎలాంటి మందులు వాడాలో సలహా ఇవ్వడం, ఒక పల్స్ ఆక్సిమీటర్, మూడు సర్జికల్ మాస్కులు, ఒక గ్లౌజ్ బాక్సులు, ఉచితంగా ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు కొందరు ప్రైవేట్ వైద్యులు. హోం క్వారంటైన్ ప్యాకేజీలు ఇవ్వాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలి కానీ ప్రైవేట్ వైద్యులు నిబంధనలు గాలికి వదిలేసి దర్జాగా దందా మొదలెట్టేశారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కోవిడ్ బారిన పడితే ఏదో జరిగిపోతుందని భయపెడుతూ రోగుల ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అనుమతి లేకుండా ప్యాకేజీ వైద్యం అందించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నగరంలోని నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా వైద్యం చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ కొన్ని ఆసుపత్రులు ఎలాంటి అనుమతి లేకున్నా దర్జాగా కోవిడ్ పేషెంట్లకు అడ్మిట్ చేసుకుని మరీ వైద్యం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా భయంతో..మొన్నటి వరకు ఆసుపత్రులు మూసుకున్న ప్రైవేట్ వైద్యులు ఇప్పుడు కాసుల కోసం అనుమతులు లేకున్నా వైద్యం అందిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అనుమతి లేకున్నా కోవిడ్ వైద్యం అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories