PM Modi: ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

Prime Minister Modi to Hyderabad Today
x

PM Modi: ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

Highlights

PM Modi: సా.6 గంటలకు ఢిల్లీకి మోడీ తిరుగుపయనం

PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొననున్నారు.

సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోడీ చేరుకుంటారు. ఆ తర్వాత 5 గంటల 40 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని నేతలు భావిస్తున్నారు. సభ అనంతరం తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. మోడీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాయి.

ఈ నెల 25, 26, 27వ తేదీల్లో తెలంగాణకు రానున్నారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ.. 25న కరీంనగర్‌లో జనగర్జన సభ, 26న నిర్మల్ జనగర్జన సభ, 27న హైదరాబాద్‌లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories