PM Modi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi Election Campaign in Telangana
x

PM Modi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ప్రధాని మోడీ

Highlights

PM Modi: ఉదయం 10:25 కి తిరుపతి నుంచి బయల్దేరనున్న మోడీ

PM Modi: తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.30 హకీంపేట్‌కు నరేంద్రమోడీ చేరుకుంటారు. హకీంపేట్ నుంచి 12.35 గంటలకు మోడీ మహబూబాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.25 వరకు 40 నిమిషాలపాటు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబాబాద్‌ నుంచి బయలుదేరి 2.30 గంటలకు మోడీ కరీంనగర్ చేరుకోనున్నారు.

మధ్యాహ్నం 2.45 నుంచి 3.25 గంటల వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4.35 గంటలకు మోడీ హైదరాబాద్ విమానాశ్రయనికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు హైదరాబాద్ రోడ్డు షోలో మోడీ పాల్గొంటారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల రోడ్ షోలో మోడీ ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు సాగుతారు. రోడ్ షో తర్వాత గురుపౌర్ణమి సందర్భంగా అమీర్‌పేట్‌లోని గురుద్వారాలో నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories