Draupadi Murmu: భూదాన్ పోచంపల్లిలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President Draupadi Murmu Visit To Bhudan Pochampally Tomorrow
x

Draupadi Murmu: భూదాన్ పోచంపల్లిలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Highlights

Draupadi Murmu: పద్మశ్రీ, సంత్ కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో మాటామంతీ

Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ప్రెసిండెంట్ పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. హెలీప్యాడ్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు సందర్శించి పరిశీలించారు.

రేపు ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు. పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్కులో మొదటగా వినోబా భావే విగ్రహానికి పూలమాల వేసి,, అక్కడనుండి పక్కనే ఉన్న వినోబాభావూ మందిరంలో ఫోటో ఎగ్జిబిషన్‌ను ముర్ము పరిశీలించనున్నారు. అనంతరం పోచంపల్లి లోని నేతన్నల ఇండ్లలోకి వెళ్లి వారి యొక్క స్థితిగతులను తెలుసుకోనున్నారు, అనంతరం శ్రీ రంజన్ పరిశ్రమలో పట్టుపురుగుల నుండి పట్టు ధారాన్ని తీసి చీరల తయారు చేసే కేంద్రాన్ని సందర్శించనున్నారు.

అనంతరం శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో చేనేత కార్మికులతో ముఖాముఖి జరుపుతారు. స్థానిక శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో పద్మశ్రీ, సంత్ కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16మందిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారని అధికారులు వెల్లడించారు.

చేనేత, జౌళి శాఖ అధికారులు చేనేత ఔన్నత్యం, తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే విధంగా థీమ్ ఫెలివియన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చంపేట చీరలు, నారాయణపేట చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, గద్వాల చీరల ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు చేనేత మగ్గాల ప్రదర్శన ఉంటుందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories