కరీంనగర్‌‌ జిల్లాలో పవర్‌ఫుల్‌ రివెంజ్‌ స్టోరి

కరీంనగర్‌‌ జిల్లాలో పవర్‌ఫుల్‌ రివెంజ్‌ స్టోరి
x
కరీంనగర్‌‌ జిల్లాలో పవర్‌ఫుల్‌ రివెంజ్‌ స్టోరి
Highlights

నమ్మినవారే ఆనాడు మోసం చేశారు...వారే ఇప్పుడు మళ్లీ టికెట్ల కోసం క్యూ కట్టారు...ఇప్పుడు తమ టైం రావడంతో లెక్క సెటిల్ చేసే పనిలో ఉన్నారట ఆ ముగ్గురు...

నమ్మినవారే ఆనాడు మోసం చేశారు...వారే ఇప్పుడు మళ్లీ టికెట్ల కోసం క్యూ కట్టారు...ఇప్పుడు తమ టైం రావడంతో లెక్క సెటిల్ చేసే పనిలో ఉన్నారట ఆ ముగ్గురు మంత్రులు. కరీంనగర్ జిల్లాలో మినిస్టర్ల మాటల వెనక అర్థం ఇదేనా క్యాడర్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

కరీంనగర్‌‌ జిల్లాలో పవర్‌ఫుల్‌ రివెంజ్‌ స్టోరి. సొంత పార్టీలో ద్రోహుల మీద కసిగా రగిలిపోతున్న ముగ్గురు మంత్రులు. మున్సిపోల్స్‌ ఆయుధంతో ముచ్చెమటలు పట్టించే వ్యూహం

ముగ్గురు మంత్రుల ప్రతీకార జ్వాల ఎలా ఉండబోతోంది?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ లో కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కోలా స్పందించినా ముగ్గురి మాటల వెనకా అర్ధం ఒకటే అనే చర్చ సాగుతోంది. ఏడాది కిందట జరిగిన ఘటనపై ఈ ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారు. కొంతమంది చేసిన గాయానికి, వారు ఇప్పటికీ లోలోపల పగతో రగిలిపోతున్నారు. ఇంకా వేచి చూస్తే, మంచిది కాదనుకున్నారో ఏమో గాని, ఇక అదను చూసి దెబ్బ కొట్టాలని వారు డిసైడ్ అయ్యారట.

ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్. ఈ ముగ్గురు మంత్రులే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నారంటూ జిల్లాలో చర్చ స్టార్ట్ అయ్యింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయంటూ సొంత పార్టీలో కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. తమకు ద్రోహం చేసిన శత్రువు ఎవరో తెలిసినా, ఏడాది కాలంగా మౌనంగా ఉన్న మంత్రులు ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా తమ ఆపరేషన్ మొదలు పెట్టారట. కొంతమంది తెలిసి మరికొంత మంది తెలియక నూతిలో పడ్డ ఎలుక మాదిరిగా ఆందోళన చెందుతున్నారట.

ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రులకు, గెలుపు కంటే గుణపాఠాన్నే నేర్పించాయి గత అసెంబ్లీ ఎన్నికలు. తమకు అనుచరులుగా ఉన్న వారంతా, తీరా సమయానికి వ్యతిరేకులుగా మారి, తమ నాయకలనే ఓడించే ప్లాన్ చేశారట. ఎన్నికల సమయంలో ఎవరినీ దూరం పెట్టలేని, అలాగే నిందించలేని పరిస్థితి. ఎలాగోలా ప్రజల మద్దతుతో విజయం సాధించి, సీనియారిటి, పార్టీ విధేయత కోటలో మంత్రి పదవులు సంపాదించుకున్నారు ఈటెల, కొప్పుల, గంగుల. వెన్నుపోటుదారుల సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యారట మినిస్టర్లు.

గత ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. మంత్రి పదవి ఎలాగైనా వస్తుందన్న జోష్‌లో ముమ్మర ప్రచారం చేశారు. తీరా సమయానికి ఈశ్వర్‌కి అనుకూలంగా ఉన్నవారంతా ఓ మాజీ ఎంపీకి సపోర్ట్ చేయడంతో, చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు విజయం సాధించారు. అప్పటి వరకు అందరినీ గుడ్డిగా నమ్మిన ఈశ్వర్, ఇప్పుడు తన మార్క్ రాజకీయాలు చేస్తూ ద్రోహులను హడలెత్తిస్తున్నారట.

ఇక ఈటెల రాజేందర్. తనను ఓడించడానికి సొంతపార్టీలో వున్న చాలామంది ట్రై చేశారని, ఇప్పటికీ రగిలిపోతున్నారాయన. పదవుల కోసం ఈటెల చుట్టూ తిరగడం పదవులు రాగానే ఈటెలకు తలనొప్పిగా మారడం హుజూరాబాద్ రాజకీయాల్లో సాధారణమైంది. నమ్మక ద్రోహం చేసిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కుదరదంటూ బహిరంగంగానే చెప్పేశారు ఈటెల.

నమ్మిన వారే వెన్ను పోటు పొడిచారని ఆగ్రహంతో వున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు, టీఆర్ఎస్‌ మీద ఉన్న విశ్వాసంతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నానని అంటున్నారు గంగుల. నాడు తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి ఆటకట్టించే పని మొదలుపెట్టారట.

ముగ్గురు మంత్రులకీ మున్సిపల్ ఎన్నికల రూపంలో, ఒక మంచి ఆయుధం దొరికినట్టయ్యింది. నమ్మకద్రోహం చేసినవారిని పక్కకు పెట్టె అవకాశాన్ని కల్పించాయి పోల్స్. వ్యతిరేకులు, నమ్మకద్రోహులు, వెన్నుపోటుదారుల కోటాలో లిస్ట్ తయారు చేసుకున్న మంత్రులు, వారికి టికెట్ ఇవ్వకుండా పొలిటికల్ దెబ్బ తీయడానికి ప్లాన్ చేశారట. మంత్రుల లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారో తెలీదు గాని పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే వారిపై రాజకీయ వేటు పడే అవకాశం ఉంది. చూడాలి, ఈ ప్రతీకారజ్వాలలు గులాబీ దండులో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories