ponnam prabhakar letter to kcr :ముఖ్యమంత్రి కేసీఆర్ కి పొన్నం లేఖ.. ఆ జిల్లాకి పీవీ పేరు పెట్టాలంటూ డిమాండ్!

ponnam prabhakar letter to kcr :ముఖ్యమంత్రి కేసీఆర్ కి పొన్నం లేఖ.. ఆ జిల్లాకి పీవీ పేరు పెట్టాలంటూ డిమాండ్!
x
Highlights

ponnam prabhakar letter to cm kcr : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ లేఖలో అయన రైతుబంధు పథకానికి మరియ వరంగల్ అర్బన్ జిల్లాకి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ లేఖలో అయన రైతుబంధు పథకానికి మరియ వరంగల్ అర్బన్ జిల్లాకి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీరాంసాగర్ కాలువతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీకి, ఒక యూనివర్సిటీకి కూడా ఆయన పేరు పెట్టాలని అయన తన లేఖలో పేర్కొన్నారు..

ఇక 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంతో పాటుగా పార్లమెంటులో కూడా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, ప్రస్తుతం ఆ పెండింగ్‌లో ఉన్న ఆ తీర్మానాన్ని అమలుకు కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇక అయన శతజయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నట్లు పొన్నం ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీకి పీవీ ఓ ఆస్థి అని అయన అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా, భారత ప్రధానిగా అవకాశాలు లభించాయని, కాంగ్రెస్ పార్టీ వల్లే అది సాధ్యమైందని పొన్నం అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్‌లోని దేశంలోనే అతిపొడవైన ఫ్లై ఓవర్‌కు పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరు పెట్టమని ఈ సందర్భంగా పొన్నం గుర్తుచేశారు. ఈ నెల 28 నుంచి పీవీ నరసింహారావు జయంతి వేడుకలను జరపాలని ఇప్పటికే టీపీపీసీ చీఫ్ ఉత్తమ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories